: వరంగల్ జిల్లాలో ఈ నెల 24 నుంచి షర్మిల పరామర్శ యాత్ర


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తెలంగాణలో మరోసారి పరామర్శ యాత్ర చేయబోతున్నారు. ఈ నెల 24 నుంచి వరంగల్ జిల్లాలో ఆమె యాత్ర మొదలవనుంది. మొదటి విడత యాత్రలో భాగంగా 32 కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారని వైసీపీ నేతలు కొండా రాఘవరెడ్డి, మహేందర్ రెడ్డి, అహ్మద్ తెలిపారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక వరంగల్ జిల్లాలో 72 మంది మరణించారని, వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే 4 జిల్లాలలో షర్మిల పరామర్శ యాత్ర ముగిసింది.

  • Loading...

More Telugu News