: కాంగ్రెస్ తో ఏపీకి న్యాయం జరిగేది: డీకే అరుణ


తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి దర్శనంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం అరుణ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ కు తప్పకుండా న్యాయం జరిగేదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి, అన్ని పార్టీల నేతల విజ్ఞప్తి మేరకే అధినేత్రి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు కాకపోయినా ఇంకోసారైనా తెలంగాణ వచ్చేదన్నారు. అయితే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు అన్యోన్యంగా కలసిమెలసి ఉండాలని అరుణ ఈ సందర్భంగా కోరారు.

  • Loading...

More Telugu News