: ఎస్వీయూలో ర్యాగింగ్ చేసిన వారికి టీసీలు: ఏపీ సర్కారు ఆదేశం!


తిరుపతి శ్రీ వెంకటేశ్వరా యూనివర్శిటీలో కలకలం సృష్టించిన ర్యాంగింగ్ ఉదంతంపై ఏపీ సర్కారు సీరియస్ అయింది. మరికాసేపట్లో ర్యాగింగ్ చేసిన విద్యార్థులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న విషయమై వర్శిటీ వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్ లు సమావేశమై నిర్ణయం తీసుకోనున్న తరుణంలో ఏపీ ఉన్నత విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వారితో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోను వారిని ఉపేక్షించవద్దని, కఠిన చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించారు. ఏపీలో ర్యాగింగ్ భూతాన్ని సమూలంగా నాశనం చేయాలంటే, కొంత కఠినంగా వ్యవహరించాల్సిందేనని అభిప్రాయపడ్డ ఆయన, ఈ ముగ్గురికీ టీసీలు ఇచ్చి పంపాలని సూచించినట్టు తెలుస్తోంది. కాగా, ఎంసీఏ సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ పట్ల విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

  • Loading...

More Telugu News