: ఆకాశంలో జెట్, సెస్నా 172 విమానాల ఢీ
ప్రమాదాలకు గురవుతున్న విమానాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలోని శాన్ డియాగో కౌంటీలో నిన్న ఉదయం 11 గంటల సమయంలో (భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 11:30 గంటలు) రెండు విమానాలు ఆకాశంలో ఢీకొని పేలిపోయాయి. రెండు ఇంజన్లున్న సాబ్రిలైనర్ జెట్, సింగిల్ ఇంజన్ ఉండే సెస్నా 172 విమానాలు గుద్దుకున్నాయి. ఆ వెంటనే మండిపోతూ కుప్పకూలాయి. ఈ ప్రమాదం పొలాల్లో జరగడంతో విమానాల్లో ప్రయాణిస్తున్న నలుగురు మాత్రమే చనిపోయారు. అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగా, ఒకరికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ రెండూ బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతానికి వెళ్తున్నాయని, పైలట్ల మధ్య సమన్వయం లేకనే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నట్టు వివరించారు.