: ప్రధానిపై పుస్తకం రాయాలని ఉంది: కోరిక బయటపెట్టిన కేంద్ర మంత్రి
ప్రధాని నరేంద్ర మోదీ జీవిత చరిత్రపై ఓ పుస్తకం రాయాలని ఉందని కేంద్ర మంత్రి ఉమాభారతి తన మనసులోని కోరికను బయటపెట్టారు. భోపాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, మోదీ ప్రధాని కాకముందు ఆయన గురించి తనకు ఏమీ తెలియదని అన్నారు. కేంద్ర మంత్రి వర్గంలో పనిచేయడం ప్రారంభించిన తరువాత ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. ఆయన జీవితం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నారు. ప్రతి భారతీయుడి అవసరాలు తెలుసుకుని, వాటిని తీర్చేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.