: హజ్ యాత్రికుల కోసం 230 ఎయిరిండియా విమాన సర్వీసులు


హజ్ యాత్రికుల కోసం ఎయిరిండియా ప్రత్యేక విమానాలు నడపనుంది. ఏడు నగరాల నుంచి 230 సర్వీసులు నడపనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. ఢిల్లీ, శ్రీనగర్, ముంబై, హైదరాబాదు, కొచ్చి, గోవా, నాగ్ పూర్ నగరాల నుంచి ఈ సర్వీసులను నడపనున్నట్టు సంస్థ తెలిపింది. రెండు దశల్లో నడపనున్న ఈ సర్వీసుల ద్వారా 38 వేల మంది ప్రయాణికులను జెడ్డా చేర్చనున్నట్టు ఎయిరిండియా స్పష్టం చేసింది. ప్రయాణికులను హజ్ యాత్రకు తీసుకెళ్లేందుకు వీలుగా 380 సీట్ల సామర్థ్యం కలిగిన బీ777-300 ఈఆర్ విమానాలను వినియోగించనున్నట్టు ఎయిరిండియా అధికారులు తెలియజేశారు.

  • Loading...

More Telugu News