: చిరంజీవిగారితో సినిమా చేయాలని పదిసార్లు తిరిగాను!: ఉపేంద్ర


15 ఏళ్ల కిందట చిరంజీవి గారితో సినిమా చేద్దామని ప్రయత్నించానని, అందుకోసం ఆయనని 10 సార్లు కలిశానని కన్నడ సినీ నటుడు ఉపేంద్ర చెప్పారు. పది కథలు వినిపించినా ఎందుకో కానీ, ఆయనతో సినిమా చేయలేకపోయామని చెప్పారు. అయితే ఆ తరువాత కూడా చాలా సార్లు చిరంజీవి గారిని కలిసి 'సార్, మనం ఓ సినిమా చేద్దాం' అని అడిగానని, దానికి ఆయన నవ్వి, 'కన్నడలో హీరోగా సక్సెస్ అయ్యావు కదా? నటించు' అంటూ ప్రోత్సహించారని ఉపేంద్ర చెప్పాడు.

  • Loading...

More Telugu News