: ప్రేమ అంటే ఏమిటి? అని తీవ్రంగా ఆలోచించా...చివరకు అర్థమైంది: ఉపేంద్ర
కాలేజ్ లో ఉన్నప్పుడు అందరూ ప్రేమ అంటూ ఉంటే అసలు ప్రేమ అంటే ఏంటి? అని ఆలోచించేవాడినని నటుడు ఉపేంద్ర చెప్పాడు. 'ఉపేంద్ర 2' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, అబ్బాయికి, అమ్మాయికి మధ్య నిజమైన ప్రేమ ఉంటుందా? అని తెగ ఆలోచించేవాడినని చెప్పాడు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అని అనిపించేదని, నిజమైన ప్రేమ ఉంటుందా? అనిపించేదని అన్నాడు. అబ్బాయి నిరుపేద అయి, చూడడానికి ఆకర్షణీయంగా లేకుండా, చెడు అలవాట్లు కలిగి ఉంటే ఏ అమ్మాయి అయినా అతన్ని ప్రేమిస్తుందా? అనిపించేదని, అలాగే అమ్మాయి అందంగా లేకుండా, గుడ్ క్యారెక్టర్ లేకపోతే ప్రేమ ఉంటుందా? అనిపించేదని ఉపేంద్ర చెప్పాడు. అమ్మాయి, అబ్బాయి మధ్య పుట్టే ప్రేమలో బిజినెస్ ఉంటుందని, లేదంటే ఆకర్షణ ఉంటుందని అనిపించిందని ఉపేంద్ర చెప్పాడు. చివరకు అన్ కండిషనల్ లవ్ అంటే ఏంటో తెలిసిందని, అమ్మది అన్ కండిషనల్ లవ్ అని, దానిని అంతా అర్థం చేసుకోలేరని, అలా అర్థం చేసుకుంటే అమ్మను ఎవరూ కష్టపెట్టరని ఉపేంద్ర అభిప్రాయపడ్డాడు.