: పాకిస్తాన్ వయా దుబాయ్... ఉగ్రవాదుల నయా ప్లాన్


శుక్రవారం హైదరాబాదులోని చంచల్ గూడలో పట్టుబడిన హుజీ ఉగ్రవాదుల కార్యకలాపాలపై పోలీసుల విచారణ ముమ్మరంగా జరుగుతోంది. ఉగ్రవాది నసీర్ దగ్గర్నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని పాస్ పోర్టులు వచ్చేందుకు సహకరించిన ఎస్బీ పోలీసులను ప్రస్తుతం విచారిస్తున్నారు. నసీర్ గ్యాంగ్ కు సహకరించిన రెండు పాస్ పోర్టు ఏజెన్సీల యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. బంగ్లాదేశ్, మయన్మార్ కు చెందిన 15 మందిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్ పంపినట్టు తెలుస్తోంది. ఆ 15 మంది ఇప్పుడు ఎక్కడున్నారు? అనే విషయం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, హైదరాబాదులో తిష్టవేసిన నసీర్ గ్యాంగ్ ఇక్కడ ఎవర్ని ఉగ్రవాదం రొచ్చులోకి లాగింది? అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. వీరి ఉచ్చులో ఎవరైనా పడ్డారా? ఎలాంటి వారిని వీరు ఉగ్రవాదంలోకి ఆహ్వానించే ప్రయత్నం చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News