: బీహార్ రహదారుల అభివృద్ధికి 56000 కోట్లు కేటాయించనున్న ప్రధాని


బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్రానికి నిధుల వెల్లువ ప్రారంభం కానుంది. బీహార్ వ్యాప్తంగా విస్తరించిన 4,371 కిలో మీటర్ల జాతీయ, రాష్ట్ర స్థాయి రహదారుల అభివృద్ధికి 56 వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, మంగళవారం బీహార్ లోని అరా జిల్లాలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రకటన చేసే అవకాశముందని సమాచారం. అందులో భాగంగా బీహార్ లో 6,200 కోట్ల రూపాయలతో 11 జాతీయ రహదారుల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ నిధులతో సంబంధం లేకుండా, మరో 56 వేల కోట్ల రూపాయలు ప్రకటించనున్నట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News