: బాంబు దాడిలో పాక్ పంజాబ్ హోం మంత్రి మృతి


పాకిస్ధాన్ లోని పంజాబ్ లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ రాష్ట్ర హోం మంత్రి షుజా ఖాన్ జాదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఉదయం ఆయన నివాసంలోకి చొరబడిన ఆత్మాహుతి దాడి సభ్యుడు జరిపిన దాడిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. వారందరినీ భద్రతా దళాలు హుటాహుటీన ఆసుపత్రికి తరలించగా, హోం మంత్రి సహా మరో నలుగురు మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. పేలుడు ధాటికి ఆయన నివాస గృహం తీవ్రంగా దెబ్బతింది.

  • Loading...

More Telugu News