: సెక్షన్ 8 హైదరాబాదులో కాదు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి: రోజా


చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్ ఛైర్ పర్సన్ శాంతకుమారి భర్తను అరెస్టు చేయడంపై వైఎస్సార్సీపీ నేత రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, టీడీపీ అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. సెక్షన్ 8 హైదరాబాదులో పెట్టాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారని, సెక్షన్ 8 అవసరం హైదరాబాదు కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని అన్నారు. టీడీపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతూ, వైఎస్సార్సీపీ నేతలను జైలు పాలు చేస్తోందని ఆరోపించారు. విధుల్లో ఉన్న ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని కొడితే చర్యలు తీసుకోకుండా, సీఎం ఇంటికి పిలిపించుకుని సెటిల్ మెంట్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ చూస్తున్నారని, టీడీపీకి బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే వస్తుందని రోజా పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నేతలకున్న ప్రజాదరణను తట్టుకోలేని టీడీపీ పోలీసు కేసులు పెడుతూ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News