: ఇండోనేషియా విమానం అదృశ్యం


ఇండోనేషియాకు చెందిన ఒక విమానం అదృశ్యమైందని అధికారులు వెల్లడించారు. ఐదుగురు చిన్నపిల్లలు సహా 44 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో బయల్దేరిన విమానం పుపువా ప్రాంతంలో రాడార్ తో సంబంధాలు కోల్పోయింది. అనంతరం విమానం అదృశ్యమైనట్టు అధికారులు వెల్లడించారు. ఇండోనేషియాలోని జయపుర విమానాశ్రయ కేంద్ర పరిధిలోని శాంటాని విమానాశ్రయం నుంచి ఇది బయల్దేరినట్టు సమాచారం. దీని కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. కాగా, 2014 డిసెంబర్ 28న 162 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఎయిర్ ఏషియా విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News