: తొలి సెట్లో ఓడిన సైనా... చరిత్ర సృష్టించేనా?
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో ఫైనల్ కు చేరి చరిత్ర సృష్టించిన సైనా నెహ్వాల్ తొలి సెట్లో తడబడింది. ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న పోటీల ఫైనల్స్ తొలి సెట్లో 21-16 తేడాతో స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయింది. రెండో సెట్ ప్రస్తుతం హోరాహోరీగా సాగుతుండగా, చెరో 12-13 పాయింట్లతో మారిన్ ఆధిక్యంలో ఉంది. ఈ సెట్ సైనా గెలిస్తే మ్యాచ్ మూడో సెట్ కు వెళుతుంది. ఈ మ్యాచ్ గెలిచి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ గా సైనా నిలవాలని ప్రతి భారతీయ క్రీడాభిమాని కోరుకుంటున్నారు.