: సాంకేతిక లోపంతో న్యూయార్క్, వాషింగ్టన్ లో నిలిచిన 400 విమానాలు
అమెరికాలో వందలాది సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల్లో ఎయిర్ ట్రాఫిక్ కేంద్రంలో సాంకేతిక లోపాలు ఏర్పడటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. ఈ ఎయిర్ పోర్టుల్లో 400కు పైగా విమానాలు నిలిచాయని తెలిపారు. దీనికితోడు వందల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, మరికొన్ని రద్దు చేయాల్సి వచ్చిందని వివరించారు. ప్రయాణికులు తాము ప్రయాణించే విమాన సమాచారాన్ని ముందుగానే తెలుసుకుని జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన శ్రమిస్తున్నట్టు తెలియజేశారు.