: కుమార్తెను వేధిస్తున్న భార్యపై ఫిర్యాదు


కన్న కూతురిలా చూసుకోవాల్సిన చిన్నారిని వేధిస్తున్న ఓ తల్లిపై స్వయంగా భర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్, ఎల్బీనగర్, మన్సూరాబాద్ కు చెందిన టి.రమేష్ ప్రైవేటు ఉపాధ్యాయుడు. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కొద్ది కాలం క్రితం ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలైన పుష్పలతను రెండవ వివాహం చేసుకున్నాడు. ఆమెకు 8 సంవత్సరాల బాబు ఉండగా, రమేష్ కు మూడేళ్ల కుమార్తె వుంది. ఆదిలో పాపను బాగానే చూసుకున్న పుష్పలత కొంతకాలంగా ఇబ్బందులు పెడుతోంది. దీనిపై ఎంతగా చెప్పిచూసినా వినలేదు. పాపను కొడుతుంటే అడ్డుకోబోయిన రమేష్ తల్లి, చెల్లెలిపైనా విరుచుకుపడింది. దీంతో రమేష్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పుష్పలతపై కేసు పెట్టిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News