: సినీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు తీవ్ర అస్వస్థత
ప్రముఖ సంగీత దర్శకుడు, సంగీత బ్రహ్మ, మాస్ట్రో ఇళయరాజా గత రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు వచ్చినట్టు సమాచారం. ఇళయరాజాను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులిటన్ విడుదల చేయనున్నారు. ఇళయరాజా అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని, ఆయన కుటుంబ సభ్యులను పలువురు సినీ రంగ ప్రముఖులు వివరాలు అడుగుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.