: కేరళలో ఇప్పుడంతా డిజిటల్!
దేశంలో మెరుగైన అక్షరాస్యత కలిగి ఉన్న రాష్ట్రాల్లో కేరళ గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. విద్యాధికుల రాష్ట్రంగా కేరళను పేర్కొంటారు. ఇప్పుడీ దక్షిణాది రాష్ట్రం సంపూర్ణ డిజిటల్ రాష్ట్రంగా అవతరించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వూమెన్ చాందీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటన చేశారు. కేరళ పూర్తిస్థాయి డిజిటల్ రాష్ట్రమని ప్రకటించారు. 100 శాతం మొబైల్ సాంద్రత, 75 శాతం ఈ-అక్షరాస్యత, హయ్యస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ రేట్, పంచాయతీల స్థాయి వరకు బ్రాడ్ బ్యాండ్ విస్తరణ ఇత్యాది ఘనతల నేపథ్యంలో రాష్ట్రం పూర్తిగా డిజిటల్ సొబగులు సంతరించుకుందని చాందీ పేర్కొన్నారు. బ్యాంకు అకౌంట్లు, ఆధార్ అనుసంధానం, ఈ-డిస్ట్రిక్ట్స్ కార్యక్రమాలు డిజిటల్ కేరళకు బలమైన పునాది వేశాయని వివరించారు.