: ఇప్పటికీ నన్ను 'బసంతి' అనే పిలుస్తున్నారు: హేమమాలిని
బాలీవుడ్ లో నిన్నటి తరం డ్రీమ్ గాళ్ హేమామాలిని 'షోలే' సినిమా విడుదలై నేటికి 40 ఏళ్లయిన సందర్భంగా స్పందించారు. ఆ సినిమాలో తన పాత్ర పేరు బసంతి అని, ఇప్పటికీ తనను ఆ పేరుతోనే పిలుస్తుంటారని తెలిపారు. అలా పిలవడం తనకెంతో సంతోషాన్నిస్తుందని పేర్కొన్నారు. షోలే వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో భాగమైనందుకు గర్విస్తున్నాని ఈ మేరకు ట్వీట్ చేశారు. 1975 ఆగస్టు 15న రిలీజైన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అంజాద్ ఖాన్, జయబాధురి, హేమామాలిని, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్డీ బర్మన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రమేశ్ సిప్పీ దర్శకుడు. ఈ సినిమాలో అత్యధిక భాగం కర్ణాటకలోని రామనగర ప్రాంతంలో చిత్రీకరించారు.