: సోనియాగాంధీతో భేటీ అయిన టీడీపీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీతో టీడీపీకి ఉన్న వైరం అలాంటిది ఇలాంటిది కాదు. రెండు పార్టీల నేతలు కలుసుకోవడం కూడా సాధారణంగా జరగదు. కానీ, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంఘాల నేత కృష్ణయ్య ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. బీసీ వర్గాల డిమాండ్లపై మద్దతు కూడగట్టే అంశంలో భాగంగా వివిధ పార్టీల నేతలను ఆయన కలుస్తున్నారు. ఈ క్రమంలోనే సోనియాగాంధీతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ 34 శాతం టికెట్లు ఇచ్చినప్పటికీ.... ఉన్నత సామాజిక వర్గాలతో పోటీపడలేక ఓడిపోయారని చెప్పారు. ఎన్నికల్లో ధన ప్రభావం తగ్గాలంటే బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని అన్నారు.