: విద్యార్థుల అభిమానంతో ఇబ్బంది పడ్డ మోదీ
ఉప్పొంగిన విద్యార్థుల అభిమానంతో ప్రధాని నరేంద్ర మోదీ కొంత ఇబ్బంది పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసి, ఆ తర్వాత జాతిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత విద్యార్థులతో కరచాలనం చేసేందుకు వారి దగ్గరకు వెళ్లారు. ఈ నేపథ్యంలో, ఆయనతో కరచాలనం చేసేందుకు ఒక్కసారిగా విద్యార్థులు ఎగబడ్డారు. ఒక్కసారిగా పిల్లలు తోసుకు రావడంతో... మోదీ కిందకు పడబోయారు. దీంతో, ఆయన వ్యక్తిగత సిబ్బంది మోదీకి అడ్డుగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని ముగించిన తర్వాత, అక్కడ నుంచి తన నివాసానికి బయల్దేరి వెళ్లారు మోదీ.