: ఇన్ఫినిటీ రైడ్ లో నారా లోకేశ్ సందడి... 30 కిమీ సైకిల్ రైడ్, ఉత్సాహం నింపిన సినీ నటి రెజీనా


స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులో నేటి ఉదయం 'ఇన్ఫినిటీ సైకిల్ రైడ్' పేరిట భారీ కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో అక్కడ చేరిన యువకులు దాదాపు 30 కిలో మీటర్ల దూరం మేర సైకిళ్లపై చెమటోడ్చారు. టీడీపీ యువనేత, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ ఈ ర్యాలీని జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాక యువతతో చేతులు కలిపిన లోకేశ్ స్వయంగా సైకిలెక్కారు. ఏకంగా 30 కిలో మీటర్ల మేర యువతతో కలిసి సైకిల్ సవారీ చేశారు. ఇక టాలీవుడ్ అందాల భామ రెజీనా ఈ ర్యాలీలో పాల్గొని యువతలో ఉత్సాహం నింపింది.

  • Loading...

More Telugu News