: తెలుగుదేశం సత్తా ఇదే: చంద్రబాబు
అత్యంత ప్రాధాన్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటం వల్లే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించడం ద్వారా... కృష్ణా డెల్టాను సస్యశ్యామలం చేయవచ్చని చెప్పారు. ముందు ప్రకటించిన విధంగానే ఆగస్టు 15వ తేదీనే పట్టిసీమను జాతికి అంకితం చేస్తున్నామని... తెలుగుదేశం పార్టీ సత్తాకు ఇదో నిదర్శనం అని అన్నారు. ఇదే విధంగా వెలిగొండ, గాలేరు-నగరి, హంద్రీ నీవా, తోటపల్లి పనులు పూర్తి అయి... నదుల అనుసంధానం పూర్తి అయితే రాష్ట్రంలో కరవు అనేదే లేకుండా చేయవచ్చని చెప్పారు.