: ఆవిరవుతున్న ఆశలు... కుప్పకూలుతున్న టీమిండియా
శ్రీలంకతో గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో గెలుపుపై టీమిండియా పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. క్రీజులో కాసేపు కూడా ఉండలేమన్న రీతిలో టీమిండియా ఆటగాళ్ల రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కొనసాగుతోంది. 60 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన ఇండియా... 65 పరుగుల వద్ద ఆరో వికెట్, 67 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాహా ఔట్ కాగా... హర్భజన్ సింగ్ ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ రెండు వికెట్లను హెరాత్ కూల్చాడు. ప్రస్తుతానికి భారత్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 77 పరుగులు. డ్రా చేసుకోవడానికి అవకాశం లేని ఈ మ్యాచ్ లో టీమిండియాకు గెలుపొక్కటే మార్గం. విజయం కోసం భారత్ కు మరో 99 పరుగులు కావాలి. మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి. రహానే (17), అశ్విన్ (3) క్రీజులో ఉన్నారు.