: తూర్పు తీరాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యం: మోదీ


ఇప్పటి దాకా పశ్చిమ తీరం అభివృద్ధిపైనే పాలకులంతా దృష్టి సారించారని... పశ్చిమ తీరం ఒక్కటే అభివృద్ధి చెందితే సరిపోదని ప్రధాని మోదీ అన్నారు. తమ దృష్టి అంతా తూర్పు తీరాన్ని అభివృద్ధి చేయడంపైనే ఉందని చెప్పారు. 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖను రైతు సంక్షేమ శాఖగా మారుస్తామని తెలిపారు. వెనుకబడిన అసోం, బీహార్, ఒడిశా, ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి దిశగా తీసుకెళతామని చెప్పారు. దేశంలో ఇప్పటికీ 18,500 గ్రామాల్లో విద్యుత్ లేదని.... రానున్న వెయ్యి రోజుల్లో ఈ 18,500 గ్రామాల్లో కూడా విద్యుత్ వెలుగులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల సహకారంతో ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News