: ‘అన్న సంజీవని’కి శ్రీకారం చుట్టనున్న చంద్రబాబు
భారత 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి ‘అన్న సంజీవని’ మెడికల్ స్టోర్లు ప్రారంభం కానున్నాయి. పేదలకు చౌక ధరలకే నాణ్యమైన ఔషధాలను అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ఏపీ సర్కారు దివంగత ఎన్టీఆర్ పేరిట ‘అన్న సంజీవని’ మెడికల్ స్టోర్లకు రూపకల్పన చేసింది. ఈ మేరకు మరికాసేపట్లో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ మెడికల్ స్టోర్లను లాంఛనంగా ప్రారంభించనున్నారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,200 ‘అన్న సంజీవని’ కేంద్రాలు ఏకకాలంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి.