: వరంగల్ లోక్ సభ, కార్పొరేషన్ టీఆర్ఎస్ ఖాతాలోకే!: కడియం


వరంగల్ లోక్ సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ భారీ విజయం సాధిస్తుందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే టీఆర్ఎస్ అభ్యర్ధిని భారీ మెజారిటీతో విజయం సాధించేలా చేస్తాయని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ ను కూడా టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వరంగల్ లోక్ సభ, కార్పొరేషన్ ఎన్నికలను సవాలుగా తీసుకుంటామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News