: వందోచిత్రం తర్వాత పూర్తిస్థాయి రాజకీయ జీవితంలోకి వస్తా: బాలకృష్ణ
నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన వందో చిత్రం తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయ జీవితంలోకి వస్తానని ప్రకటించారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేయాలన్నదే తమ కుటుంబం ఆకాంక్ష అని పేర్కొన్నారు. హిందూపురాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు. హంద్రీనీవా కాలువతో హిందూపురాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే లక్ష్యమని వివరించారు. బాలయ్య శుక్రవారం కూడా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. హిందూపురంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజు చేశారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్ ను కూడా పరిశీలించారు.