: లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసుల జారీకి కేంద్రం సిద్ధం


ఐపీఎల్ కళంకితుడు లలిత్ మోదీపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. అవినీతి ఆరోపణలపై దేశం దాటి వెళ్లిన వ్యక్తిపై అప్పట్లో యూపీఏ సర్కారు దేశీయ విమానాశ్రయాల వరకే వర్తించే లైట్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసి సరిపెట్టుకుందని, దాన్ని బట్టి కాంగ్రెస్ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ విమర్శించారు. లండన్ లో ఉన్న వ్యక్తిని నిజంగా భారత్ కు రప్పించాలని కాంగ్రెస్ భావించలేదని అన్నారు. లలిత్ మోదీ విషయంలో కేంద్రంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే అని తెలిపారు. కాగా, లలిత్ మోదీపై కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్రం రెడ్ కార్నర్ నోటీసుల జారీకి సిద్ధపడినట్టు అర్థమవుతోంది.

  • Loading...

More Telugu News