: యాంటీ ర్యాగింగ్ పాలసీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మరణంతో యాంటీ ర్యాగింగ్ పై ఏపీ ప్రభుత్వం పాలసీ ప్రకటించింది. యూనివర్శిటీ, కాలేజీ ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. బయో మెట్రిక్ విధానంలో విద్యార్థుల హాజరు నమోదు చేయాలని, హాజరు ఆధారంగా పీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలని స్పష్టం చేసింది. కాలేజీ క్యాంపస్ లోకి ఇతరులను అనుమతించకూడదని ఆదేశాలిచ్చింది. ఈ నెల 31లోపు ఈ నిబంధనలు అమలు చేయాలని యూనివర్సిటీలకు ఆదేశాలు పంపింది.

  • Loading...

More Telugu News