: అశ్విన్, మిశ్రా పోటాపోటీ వికెట్ల వేట... తేలిపోయిన హర్భజన్
టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా గాలే టెస్టులో లంకేయులను ఉక్కిరిబిక్కిరి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో ఆతిథ్య లంకను కష్టాల పాల్జేశారు. అశ్విన్ 4, మిశ్రా 3 వికెట్లు సాధించి భారత శిబిరంలో ఉత్సాహం కలిగించారు. టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటుకు గురైన లంక రెండో ఇన్నింగ్స్ లో 367 పరుగులకు ఆలౌటైంది. తద్వారా భారత్ ముందు 176 పరుగుల తేలికపాటి లక్ష్యాన్నుంచింది. లంక జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చాందిమల్ 162 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టాపార్డర్ వైఫల్యం లంకకు ప్రతికూలంగా పరిణమించింది. కాగా, ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లలోనూ సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం ఒక వికెట్ తో సరిపెట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టూ తీయలేక ఉసూరుమనిపించాడు.