: ఈ యాత్రలకు మేము రాబోము: కోడెల ఆఫర్ ను తిరస్కరించిన వైకాపా
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలందరినీ మూడు రోజుల పాటు యాత్రకు తీసుకువెళ్లాలన్న స్పీకర్ కోడెల శివప్రసాద్ నిర్ణయాన్ని వైకాపా వ్యతిరేకించింది. రాష్ట్రంలో పరిస్థితులు ఎంత మాత్రమూ బాగాలేని ఈ తరుణంలో విహారయాత్రలకు వెళ్లడం ఎంతవరకూ సబబని ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, విహారయాత్రకు వెళ్లకూడదని వైకాపా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వర్షాకాల సమావేశాలను కేవలం 5 రోజుల్లో ముగించాలన్న నిర్ణయాన్ని వైకాపా వ్యతిరేకిస్తోందని, కనీసం 20 రోజులు వీటిని నిర్వహించాలని జ్యోతుల డిమాండ్ చేశారు.