: చాందిమల్ సెంచరీ... లంకకు ఓ మోస్తరు ఆధిక్యం


గాలే టెస్టులో శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ దినేశ్ చాందిమల్ (142 బ్యాటింగ్) సెంచరీ సాధించాడు. మూడో రోజు ఆటలో భారత బౌలర్ల ధాటికి విలవిల్లాడిన లంకను చాందిమల్ తన పోరాటపటిమతో ఆదుకున్నాడు. తిరిమన్నేతో ఆరో వికెట్ కు 125, ముబారక్ తో ఏడో వికెట్ కు 82 పరుగులు జోడించాడు. దీంతో, మూడో సెషన్ లో లంక 8 వికెట్లకు 337 పరుగులతో ఆడుతోంది. ప్రస్తుతం లంక ఆధిక్యం 145 పరుగులకు చేరింది. చేతిలో మరో 2 వికెట్లే ఉన్నాయి. అంతకుముందు, భారత్ తన తొలి ఇన్నింగ్స్ ను 375 పరుగుల వద్ద ముగించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 183 పరుగులు చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News