: ఇంట్లో అందరూ తాగడానికి డబ్బుల్లేవట, 16 మద్యం షాపులకు కన్నం వేశారు!


మెదక్, వరంగల్ జిల్లాలో, ఇటీవలి కాలంలో తాళాలు వేసివున్న మద్యం షాపుల్లో దొంగతనాలు ఎక్కువయ్యాయి. మద్యం షాపుల యజమానుల నుంచి వస్తున్న ఫిర్యాదుల సంఖ్య పెరగడంతో నిఘా పెట్టిన పోలీసులు 9 మంది దొంగల ముఠా సభ్యులను నేడు అరెస్ట్ చేశారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని, తాగడానికి డబ్బుల్లేక, మద్యం దుకాణాలకు మాత్రమే కన్నం వేస్తున్నారని తెలుసుకుని విస్తుపోయారు. వీరంతా స్టేషన్ ఘనపూర్ మండలం మల్కాపూర్ వాసులని, ఇప్పటివరకూ 16 షాపులను కొల్లగొట్టారని పోలీసులు తెలిపారు. వారి నుంచి రూ. 4.72 లక్షల నగదు, రూ. 1.68 లక్షల విలువైన మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మద్యం తరలింపునకు వాడే 3 ఆటోలు, ఓ ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News