: ఫిర్యాదు పట్టించుకోని అధికారులకు ముచ్చెమటలు పట్టించాడు


నోయిడాలోని దాద్రితహసిల్ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి తన ఇంటి పరిసరాల్లో కొండచిలువ తిరుగుతోందని దాని పట్టి బంధించి తమకు ప్రశాంతత కల్పించాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదును వారు పట్టించుకోలేదు. దీంతో ఇలా లాభం లేదని తహసీల్దారు కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. వారు కూడా పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి, పాములు పట్టే వాళ్లతో ఆ కొండ చిలువను బంధించాడు. దానిని నేరుగా తీసుకెళ్లి తహసీల్దారు కార్యాలయంలో విడిచిపెట్టాడు. అంతే... క్షణాల్లో గందరగోళం ఏర్పడింది. పామును చూసిన సిబ్బంది ఎక్కడి పనులక్కడ వదిలేసి ప్రాణ భయంతో పరుగులంకించుకున్నారు. దీనిని చూస్తూ ఆ వ్యక్తి తృప్తిగా నవ్వుకున్నాడు. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో రంగ ప్రవేశం చేసిన అటవీశాఖ అధికారులు దానిని బంధించి అడవుల్లోకి తీసుకెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News