: శంషాబాద్లో కిడ్నాప్, నల్లగొండలో హత్య... విషాదాంతమైన శివలీల ఉదంతం!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ కు చెందిన బాలిక శివలీల (14) కిడ్నాప్ ఉదంతం విషాదాంతమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇక్కడి ఆర్ బీ నగర్ కు చెందిన శివలీల 5వ తేదీన కిడ్నాప్ నకు గురి కాగా, బాలిక మృతదేహం నల్లగొండ జిల్లా మోత్కూరు గ్రామంలో కనిపించింది. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసును నమోదు చేసుకున్న ఆర్జీఐఏ (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శివలీలను ఎవరు నల్లగొండ తీసుకెళ్లారన్న విషయమై సమాచారం లేదని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.