: 'భజరంగీ భాయిజాన్'లో సల్మాన్ నటనకు కత్రినా ప్రశంస


'భజరంగీ భాయిజాన్'లో సల్మాన్ ఖాన్ నటనపై బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అభిప్రాయాన్ని వెల్లడించింది. తాజాగా ఆ చిత్రాన్ని చూసిన కేట్... సల్మాన్ నటన చాలా అద్భుతంగా ఉందని తెలిపింది. ఆ సినిమా చూసిన వెంటనే ఈ విషయాన్ని తాను సల్మాన్ కు మెసేజ్ చేశానని చెప్పింది. ముఖ్యంగా దర్శకుడు కబీర్ ఖాన్ సినిమా తెరకెక్కించిన తీరు బాగుందని, చిన్నపిల్లాడి మనస్తత్వంతో సల్మాన్ నటించిన తీరు తనను చాలా ఆకట్టుకుందని కత్రినా పేర్కొంది. ఇదే దర్శకుడు రూపొందించిన 'ఫాంటమ్' చిత్రంతో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు అమ్మడు రాబోతుంది.

  • Loading...

More Telugu News