: రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
నాగార్జున వర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితులకు గుంటూరు స్థానిక కోర్టు రిమాండ్ పొడిగించింది. అంతకుముందు విధించిన రిమాండ్ నేటితో ముగియడంతో ముగ్గురు నిందితులు దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ లను పోలీసులు ఈరోజు కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఈనెల 28 వరకు కోర్టు వారి రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు తెలిపింది. కొన్ని రోజుల కిందట వారి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన సంగతి తెలిసిందే.