: భూములివ్వని రైతుల నుంచి ఈ నెల 20 తరువాత భూసేకరణ: మంత్రి నారాయణ


నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాల్లో మరోసారి భూసేకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాజధాని సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్, అధికారులు హాజరయ్యారు. సమీకరణలో భూములివ్వని రైతుల నుంచి ఈ నెల 20 తరువాత భూసేకరణ చేపట్టనున్నట్టు మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం మరో 2వేలకు పైగా ఎకరాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. రాజధాని ప్రకటన తరువాత భూముల విలువ 20 రెట్లు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News