: మన శరీరంలోని కణాల గుట్టు రట్టవుతోంది


మనిషి శరీరంలో మొత్తం ఎన్ని రకాల కణాలుంటాయి? అవి ఎలాంటి ప్రత్యేకతలను కలిగి ఉంటాయి. ఏమేం పనులు చేస్తాయి? ఇలాంటి విషయాలు ఎప్పటికీ సందేహాలే. అయితే.. వీటి ముడివిప్పే పరిశోధనల్లో శాస్త్రవేత్తలు ఓ కీలకమైన ముందడుగు వేశారు. ఈస్టర్న్‌ ఫినలాండ్‌, టెంపేర్‌, లగ్జెంబర్గ్‌ తదితర యూనివర్సిటీల శాస్త్రవేత్తలు కలిసి ఈ మనిషి కణాల రహస్యాలు తెలుసుకోవడానికి పరిశోధన చేపట్టారు.

మన శరీరంలో మొత్తం 250కి పైగా రకాల కణాలుంటాయిట. వీటికి సంబంధించి ప్రపంచంలో జరిగిన అన్ని పరిశోధనల ఫలితాలను వీరు క్రోడీకరించారు. కంప్యూటర్‌ కు ఫీడ్‌చేసి ఫలితాలను విశ్లేషించారు. వీటిలో 166 కణాల ప్రత్యేకతలను ఇప్పటికే గుర్తించారు. మనిషికి సోకే అనారోగ్యాల చికిత్సలో ఇలాంటి విషయాలు తెలిసి ఉండడం ఉపకరిస్తుందని భావిస్తున్నారు. ఈ వివరాలను శాస్త్రవేత్తల్లో ఒకరైన డాక్టర్‌ మెర్జా హీనానీమి తెలిపారు.

  • Loading...

More Telugu News