: బెంగళూరులో నిమజ్జనం జరిగే విధానాన్ని పరిశీలించాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం కోసం బెంగళూరులో నిమజ్జనం జరిగే విధానాన్ని పరిశీలించాలని ఉమ్మడి హైకోర్టు జీహెచ్ఎంసీని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడాన్ని సవాల్ చేస్తూ వేణుమాధవ్ అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం నిమజ్జనంపై పైవిధంగా సూచించింది.