: భారత్-పాక్ మధ్య చర్చలకు తేదీలింకా ఖరారు కాలేదు: విదేశాంగ శాఖ


భారత్-పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలకు తేదీలు ఇంకా ఖరారు కాలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విషయంలో ఇప్పటివరకు పాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల కాలేదన్నారు. అందుకే పాక్ అభిప్రాయం వెల్లడించాకే భారత్ నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గత నెలలో ఓ విదేశీ పర్యటనలో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, ప్రధాని మోదీ కలుసుకున్నారు. దాంతో ఇరు దేశాల మధ్య చర్చలు జరగవచ్చని అంతా భావించారు. కానీ పాక్ మాత్రం చర్చలు జరిపేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. దాంతో చర్చల విషయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.

  • Loading...

More Telugu News