: పది శాతం ఉద్యోగులను తీసేసిన చైనా ఎలక్ట్రానిక్ కంపెనీ


చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తు ఉత్పత్తి సంస్థ లెనోవా గ్రూప్ పది శాతం మంది ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటించింది. లెనోవా సంస్థలోని మొబైల్ డివిజన్ లో 300 మిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. దీంతో లెనోవా కంపెనీ మొదటి త్రైమాసికంలో నికరలాభం సగానికి పడిపోయింది. కంపెనీలో మొబైల్ డివిజన్ లో మోటరోలా ఫోన్ల అమ్మకాలు మూడో వంతు తగ్గిపోవడంతో లెనోవా షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. దీంతో లెనోవా సంస్థ సంస్కరణలు చేపట్టింది. సంస్కరణల్లో భాగంగా సుమారు 3,200 మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగులను తొలగించగానే లెనోవా షేర్లు 9 శాతం క్షీణించాయి. తాజా సంస్కరణల ద్వారా ఏడాదికి 1.35 బిలియన్ డాలర్లు మిగులుతాయని లెనోవా వెల్లడించింది.

  • Loading...

More Telugu News