: సంగారెడ్డిలో తప్పించుకున్న ఖైదీలు... సినిమాను తలపించిన పోలీసుల చేజింగ్


మెదక్ జిల్లా సంగారెడ్డిలో పోలీసుల కళ్లుగప్పి నలుగురు ఖైదీలు పరారు కాగా, వారిని పట్టుకునేందుకు పోలీసులు చేసిన చేజింగ్ సినిమాను తలపించింది. పట్టపగలు ఈ ఘటన వందలాది మంది చూస్తుండగా జరిగింది. వివరాల్లోకి వెళితే, విచారణలో భాగంగా జైలు నుంచి నలుగురు ఖైదీలను కోర్టుకు తీసుకువచ్చారు సంగారెడ్డి పోలీసులు. విచారణకు కొంత ఆలస్యం కాగా, ఈలోగా ఆ నలుగురూ పోలీసులను ఏమార్చి పరుగు లంఘించుకున్నారు. దీన్ని గమనించిన పోలీసులు వారి వెంట పరుగులు పెట్టారు. సుమారు కిలోమీటరు దూరం పరుగెత్తారు. ఇద్దరు ఖైదీలు పోలీసులకు చిక్కగా, మిగతా ఇద్దరూ తప్పించుకు పారిపోయారు. వీరి కోసం సంగారెడ్డి చుట్టుపక్కల పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ జల్లెడ పడుతున్నారు.

  • Loading...

More Telugu News