: ఏపీని 2020 కల్లా నెంబర్ వన్ స్టేట్ చేయొచ్చు: చంద్రబాబు


వాస్తవానికి, 2029 నాటికి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నామని... కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తే ఆ లక్ష్యాన్ని 2020 నాటికే సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సీఐఐ సదస్సులో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఓ సునామీ సృష్టించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం ఉండటం మనకు కలసి వచ్చే అంశమని చంద్రబాబు అన్నారు. గోదావరి, కృష్ణ నదులను అనుసంధానం చేసి, రాష్ట్రంలో కరవుకాటకాలు లేకుండా చేస్తామని చెప్పారు. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు ప్రాక్టికల్ అప్రోచ్ తో ముందుకు వెళ్లేలా చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News