: తిరుమలలో ఆగిన వెంకన్న లడ్డూ ప్రసాదం పంపిణీ
గురువారం నాడు సాంకేతిక లోపాల కారణంగా తిరుమల శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం పంపిణీ నిలిచిపోయింది. సర్వర్ లో ఏర్పడిన టెక్నికల్ ఫాల్ట్ కారణంగా, బార్ కోడింగ్ విధానం పనిచేయ లేదు. దీంతో క్యూలైన్లలో ఉన్న వారికి, అదనపు లడ్డూ టోకెన్ కౌంటర్ల వద్ద కూపన్ల జారీని అధికారులు నిలిపివేశారు. దీంతో శ్రీవారి భక్తుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సమస్యను పరిష్కరించే విషయమై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చొరవ చూపడం లేదని భక్తులు ఆరోపిస్తుండగా, సర్వర్లలో లోపాన్ని సరిచేసి తిరిగి లడ్డూ టోకెన్ల జారీ ప్రారంభిస్తామని అధికారులు వివరించారు.