: 30 ఏళ్లుగా మా నాన్న గురించి అబద్ధాలు చెబుతూనే ఉన్నారు: రాహుల్ గాంధీ


బోఫోర్స్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ, రాహుల్ గత చరిత్ర తెలుసుకుని రావాలని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన విమర్శలను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. "గత 30 సంవత్సరాల నుంచి మా నాన్న గురించి బీజేపీ అబద్ధాలు చెబుతూనే ఉంది" అని ఆయన అన్నారు. "భారత న్యాయ వ్యవస్థ బోఫోర్స్ కేసులో రాజీవ్ గాంధీ ప్రమేయం లేదని స్పష్టం చేసింది" అని గుర్తు చేసిన రాహుల్, బీజేపీకి భారత చట్టాలపై నమ్మకం లేకనే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బోఫోర్స్ కేసులో నిందితుడు ఖత్రోచీని కాంగ్రెస్ దేశం దాటించిందని ఎన్నోమార్లు బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురికాగా, 2004లో ఆయన నిరపరాధని కోర్టు తీర్పిచ్చింది.

  • Loading...

More Telugu News