: సైకిల్స్ 'హీరో' ముంజాల్ ఇకలేరు!
హీరో సైకిల్స్ పరిశ్రమను స్థాపించి, భారత సైకిల్ పరిశ్రమకు పితామహుడిగా పేరు తెచ్చుకున్న ఓం ప్రకాష్ ముంజాల్ (87) గురువారం నాడు కన్నుమూశారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. లూథియానాలోని తాను నెలకొల్పిన హీరో హార్ట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ దయానంద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో ఆయన తుది శ్వాస విడిచారని ముంజాల్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలే ఆయన మృతికి కారణమని తెలుస్తోంది. ఓపీ ముంజాల్ మృతిపట్ల పలువురు పారిశ్రామికవేత్తలు సంతాపం తెలిపారు.