: కృష్ణా జలాల అంశాన్ని లోకసభలో లేవనెత్తిన కవిత
కృష్ణా జలాల వివాదాలకు సంబంధించిన ట్రైబ్యునల్ లో తెలంగాణను కూడా భాగస్వామిని చేయాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత కోరారు. ఈ రోజు లోక్ సభలో ఆమె మాట్లాడుతూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ కూడా కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోనే ఉన్నందున ట్రైబ్యునల్ లో తెలంగాణను భాగస్వామిని చేయాలని విన్నవించారు. అలాగే, కృష్ణా నది జలాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి స్పందిస్తూ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు వస్తే సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.