: పాక్ అనుమానిత జాబితా సంస్థల్లో హఫీజ్ సయీద్ 'జమాత్ ఉద్ దవా'


ముంబయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు చెందిన 'జమాత్ ఉద్ దవా' (జేయుడి) ను అనుమానిత సంస్థల జాబితాలో ఉంచినట్టు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ దేశ పార్లమెంట్ కు తెలిపింది. దేశ ఇంటెలిజెన్స్ ఏజన్సీల పాత్ర, పలు నిషేధిత గ్రూపుల విధానంపై ఆ దేశ ఎగువ సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ విధంగా ప్రకటన చేసినట్టు 'ద ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' పత్రిక పేర్కొంది. ఏదైనా చారిటీ వ్యవహారంలో కాకుండా మరెందులోనైనా 'జేయుడి' జోక్యం ఉందని తెలిస్తే తగిన చర్య తీసుకుంటామని శాసన సభ్యులకు మంత్రి బలీఘర్ రెహ్మాన్ తెలిపారు. పలు గ్రూపుల కార్యకలాపాలను అంతర్గత వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని కూడా వివరించారు.

  • Loading...

More Telugu News